Friday, March 20, 2026
Homeసినిమా'వాల్తేరు వీరయ్య' పూనకాలు పాటకి ముహుర్తం ఫిక్స్

‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు పాటకి ముహుర్తం ఫిక్స్

చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తే.. రవితేజకు జంటగా కేథరిన్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే బాస్ పార్టీ,  నువ్వు శ్రీదేవి అయితే.., వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ఇలా మూడు సాంగ్స్ కూడా మెగా ఫ్యాన్స్ ని అలానే ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి.

అలాగే ఈ మూవీ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ నుండి పూనకాలు లోడింగ్ అనే మాస్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి తో కలిసి రవితేజ కూడా అదిరిపోయేలా చిందేయనున్న ఈ సాంగ్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో గల థియేటర్స్ లో ప్రదర్శించనున్నట్లు థియేటర్స్ లిస్ట్ ని ప్రకటించారు మేకర్స్.

హైదరాబాద్ సంధ్య 70 ఎం ఎం, నెల్లూరు ఎం 1 సినిమాస్, అనంతపూర్ ఎస్వీ సినీ మ్యాక్స్, రాజమండ్రి స్వామి, గుంటూరు భాస్కర్, విజయవాడ జయరాం థియేటర్స్ లో సాయంత్రం 5 గం. లకు ఈ సాంగ్ ని లాంచ్ చేయనున్నారు. ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular