Sunday, January 19, 2025
HomeTrending Newsఅవినీతి కెసిఆర్ కు మోడీని కలవాలంటే భయం - షర్మిల

అవినీతి కెసిఆర్ కు మోడీని కలవాలంటే భయం – షర్మిల

కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. 97500 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ సంస్థల నుంచి కాళేశ్వరం కి అప్పు తెచ్చారని ఆరోపించారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఈ రోజు గోదావరిఖని చేరుకున్న షర్మిల… బహిరంగ సభలో పాల్గొన్నారు. రామగుండం వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ షర్మిల  బహిరంగ లేఖ రాశారు. సిఎం కెసిఆర్ భారీ కుంభకోణంకి పాల్పడ్డారని ఆరోపించారు.

YS షర్మిల లేఖలో ముఖ్యాంశాలు…

కేంద్ర ప్రభుత్వంగా మీరు కాపలా కుక్కలా ఉండాలి కాదా..! ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది అని మీకు తెలుసు..మీ మంత్రులకు తెలుసు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కి తెలుసు.. కేంద్ర జల శక్తి శాఖ కి తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఒక atm లా వాడుకుంటున్నారు అని మీరే అంటున్నారు. అయినా మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. విచారణకు వెంటనే ఆదేశాలు ఇవ్వండి అని కోరుతున్నాం.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఅర్ ఒక అద్బుతం అన్నారు. మెగా అద్బుతం అని చెప్పి మెగా మోసం చేశారు. 18 లక్షల వరకు నీళ్ళు ఇస్తామని చెప్పి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. 18 లక్షల ఎకరాలు ఎక్కడ..మీరు ఇచ్చిన 50 వేల ఎకరాలు ఎక్కడ..? ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు తో వైఎస్సార్ 38 వేల కోట్ల తో పూర్తి చేద్దం అనుకున్నారు. రీ డిజైన్ చేసి లక్షా 20 వేల కోట్లకు పెంచారు. నా తలకాయ..నా చెమట అని ఎక్కడ లేని సొల్లు చెప్పారు. గోదావరి నదిపై కాళేశ్వరం అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కట్టిన 3 ఏళ్లలో మునిగిపోయిన ప్రాజెక్ట్ ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. ఇది ప్రజల డబ్బు… లక్షా 20 వేల కోట్లు. కేసీఅర్ సర్కార్ మీద దర్యాప్తు చేయాలి .. ఒక దర్యాప్తు కమీషన్ కావాలి. టెండరింగ్ దగ్గర నుంచి మొత్తం అక్రమాలు జరిగాయి. ఒక దర్యాప్తు కమీషన్ వేసి వెంటనే నిజాలు నిగ్గు తేల్చండి. దేశ ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. రోజుకు రెండు TMC లు ఎత్తి పోసే అనుమతి ఉంది. కానీ మూడేళ్లలో 50 tmc లు కూడా ఎత్తి పోయలేదు. రెండు టీఎంసీ లుగా ఉన్న ప్రాజెక్ట్ కు మూడో టీఎంసీ ఎందుకు..? అక్కరకు రాని ప్రాజెక్ట్ కి మూడు TMC ఎత్తి పోయడం ఎందుకు..? కేసీఅర్ కి డబ్బు అవసరం కాబట్టి ఇప్పుడు 3 వ TMC అంటూ ప్రతిపాదన పెట్టారు. మూడో TMC కి టెండేరింగ్ ఎక్కడ జరిగింది..? గ్లోబల్ టెండరింగ్ ఎందుకు జరగలేదు..?

ప్రగతి భవన్ లోనే టెండర్లు వేశారా…? కాంట్రాక్టర్లను పిలిచి కమీషన్ లు మాట్లాడుకొని అనుమతి ఇచ్చారా..? మీ నంబర్లు రాసుకొని అధికార దుర్వినియోగం పాల్పడిన మాట వాస్తవం. తెలంగాణకి కేసీఅర్ ద్రోహం చేస్తున్నారు. కేసీఅర్ కి తెలంగాణ ఆయన బాపు ఇచ్చిన అస్థి కాదు. తెలంగాణ కోట్ల మంది పోరాడితే వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ను కేసీఅర్ ప్రైవేట్ ఎస్టేట్ లా వాడుకుంటున్నారు. ఈ మధ్య వరదలకు ప్రాజెక్ట్ మునిగిపోతే చూడటానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అవినీతి చేశారు కాబట్టే డాచిపెట్టారు. ఒకప్పుడు బస్సులు వేసి మరీ చూపించారు కదా..? ఒక్క ఫోటో కానీ..ఒక మాట కానీ బయటకు రావడం లేదు. ఇక్కడి వాళ్ళను కాకుండా బీహార్ నుంచి కార్మికులను తెచ్చి పనులు చేపిస్తున్నరు.

మిషన్ భగీరథ తో విషపు నీళ్ళు తాగి చనిపోయినా చర్యలు లేవు. అన్ని ప్రాజెక్ట్ లు మెగా కృష్ణా రెడ్డి కే ఇస్తున్నారు. ఓకే కాంట్రాక్టర్ కి అన్ని ప్రాజెక్ట్ లు ఎందుకు ఇస్తున్నారు… విచారణ జరగాలి. అన్ని ప్రాజెక్ట్ లు ఆంధ్రా కాంట్రాక్టర్ కి ఎందుకు ఇస్తున్నారు..? ప్రతిపక్షాలు ఉండి కూడా ఏమీ మాట్లాడటం లేదు. రాహుల్ వచ్చాడు..అవినీతి జరిగింది అన్నాడు..మరి పోరాటం ఎందుకు చేయడం లేదు. ప్రతిపక్షాలకు దమ్ముంటే.. మాతో కలిసి పోరాటం చేయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి రాష్ట్రంలో మిగతా ప్రాజెక్ట్ లు పూర్తిగా నిర్వీర్యం చేశారు. చిన్న ,మద్య తరహా ప్రాజెక్ట్ లు పట్టించుకోవడం లేదు. ప్రాణహిత రీ డిజైన్ తో అదిలాబాద్ జిల్లా కు అన్యాయం చేశాడు.

మోడీ రాష్ట్రానికి వస్తున్నాడు.. ఎదురు వెళ్లి సమస్యల గురించి మాట్లాడాలి కదా. విభజన హామీలపై మాట్లాడింది లేదు..కేంద్రంతో కొట్లడింది లేదు. కెసిఆర్ పిల్లిలా దాక్కుని తిరుగుతున్నారు. విభజన హామీలు ఏమయ్యాయి అని అడగండి. ఏది చేతకాదు కానీ.. తప్పించుకు తిరగడం మాత్రం చేతనవుతుంధి. ప్రజల డబ్బుతో ఇప్పుడు బందీ పోట్ల రాష్ట్ర సమితి పార్టీ పెట్టాడు. డొక్కు స్కూటర్ లో తిరిగే కేసీఅర్ …విమానాలు కొనే స్థాయి కి ఎలా అడిగాడు. మోడీ రాష్ట్రానికి వస్తె అవినీతిపై అడుగుతాడు అని కేసీఅర్ కి భయం. కేసీఅర్ ఒక అహంకారి ..ఒక నియంత. అందుకే మొహం చాటేస్తున్నారు. ముందు జాగ్రత్తగా CBI ను సైతం కేసీఅర్ నిషేదం విధించారు.

Also Read : సింగరేణి కార్మికులకు కెసిఆర్ ద్రోహం – షర్మిల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్