Saturday, November 23, 2024
HomeTrending Newsమునుగోడు ఎన్నికలు బహిష్కరించండి - వైఎస్ షర్మిల పిలుపు

మునుగోడు ఎన్నికలు బహిష్కరించండి – వైఎస్ షర్మిల పిలుపు

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లక్ష కోట్ల అవినీతి పై విచారణ చేపట్టాలని  YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఢిల్లీలో ఈ రోజు కాగ్ అధికారులను కలిసిన YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ YSR 38 వేల కోట్లకు పూర్తి చేయాలి అనుకున్నారని, 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అనుకున్నారని వివరించారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ లక్షా 20 వేల కోట్లకు పెంచారని, ప్రాజెక్ట్ కాస్ట్ 3 ఇంతలకు పెంచారని అన్నారు. ఆయకట్టు కేవలం రెండు లక్షల ఎకరాలు మాత్రమే పెరిగిందని, ప్రాజెక్ట్ ప్రతి దశలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

కాగ్ ని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల… కెసిఆర్ ప్రభుత్వం ప్రజాధనం దోచుకుందని ఆరోపించారు. విమర్శలు వైఎస్ షర్మిల మాటల్లోనే…

కాళేశ్వరం ప్రతి ప్యాకేజీలో అవినీతి జరిగింది. నాన్ ఎన్ ప్యానెల్ కంపెనీలకు కాంట్రాక్ట్ లు ఇచ్చారు. BHEL నుంచి మోటర్లు కొన్న ధరకు ప్రభుత్వం చూపించిన ధరకు భారీగా వ్యత్యాసం ఉంది. కాగ్ మాకు హామీ ఇచ్చింది. ఇండిపెండెంట్ గా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక బృందాన్ని సైతం నియమిస్తామని హామీ ఇచ్చారు. అడిటర్స్ తో పాటు… ఇరిగేశన్ ఎక్స్పర్ట్స్ తో దర్యాప్తు చేపిస్తమని హామీ ఇచ్చారు. ఎక్కడ అవినీతి జరిగిందో కనిపెడతమని హామీ ఇచ్చారు. అవినీతి జరిగింది అని ఎవరో ఒకరు పిర్యాదు చేయాలి కదా..? పిన్ పాయింట్ చేయక పోతే కేసు ఎలా టేక్ అప్ చేస్తారు..? అందుకే దర్యాప్తు సంస్థలకు పిర్యాదు చేశాం.

కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథలో సైతం అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్షా 20 వేల కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం బ్యాంకుల నుంచి లక్ష కోట్లు అప్పులు తెచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 30 వేల కోట్లు అప్పులు తెచ్చారు. రూరల్ ఎలక్ట్రిఫికేశన్ నుంచి మరో 30 వేల కోట్ల అప్పులు తెచ్చారు. 12 వేల కోట్లు నాబార్డ్ నుంచి అప్పు తెచ్చారు. ఇది స్టేట్ లెవల్ స్కాం కాదు… నేషనల్ లెవెల్ స్కాం. భారతదేశంలోనే అతిపెద్ద స్కాం. కాగ్ స్టేట్ ఖర్చు పై కూడా ఆడిట్ చేయొచ్చు. సీబీఐని రాష్ట్రంలోని రానివ్వం అంటున్నారు. ఇది పేపర్ మని స్కాం కాదు. ఇది సెంట్రల్ ఫైనాన్స్ కంపెనీలు నుంచి దోచుకున్న మని. మా ఉద్దేశ్యం ఈ ఒక్క ప్రాజెక్ట్ కాదు… తెలంగాణ లో ప్రతి పని,ప్రతి ప్రాజెక్ట్ అవినీతి మయం.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఅర్ హస్తం ఉంది. రాష్ట్రంలో ఆడిట్ శాఖకు మంత్రిగా కేసీఅర్ ఉన్నారు. మెగా కంపెనీ నీ ఇన్వాల్వ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలను బాయ్ కాట్ చేయండి. ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నికలు కావు. స్వార్థం కోసం వచ్చిన ఎన్నికలు. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేయడంతో సమానం. YSRTP తరుపున ఎన్నికలను బాయ్ కాట్ చేయండని పిలుపునిస్తున్నం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది. హత్య ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలి. హత్య ఎవరు చేశారో తేల్చాలని కోరుకుంటున్నాం.

Also Read YSRTPని గెలిపిస్తే రెండు కోట్ల ఉద్యోగాలు -షర్మిల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్