Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి - వైఎస్ షర్మిల

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి – వైఎస్ షర్మిల

తెలంగాణలో ఏ వర్గానికి రక్షణ లేదని, సర్కారును రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని ఈ రోజు హైదరాబాద్ లో గవర్నర్  తమిలి సై ని కలిసి వైఎస్ షర్మిల వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల… ప్రతి పక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మహిళలకు గౌరవం లేదన్నారు.

షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే….
కేసీఆర్ నియంత పాలనలో ప్రతి పక్షాల గొంతు నొక్కి సమాజాన్ని, ప్రజా స్వామ్యాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే నైతికత లేదు. సర్కారును రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే లేదు. దేశంలో భారత రాజ్యాంగం అమలవుతుంటే.. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుంది. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛకు విలువ లేకుండా చేశారు. రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతి పక్షాలు అన్న పదం వింటేనే కేసీఆర్, భీఆర్ఎస్ కు ఎందుకు అంత అసహనం.

పట్టపగలే వీధి కుక్కలు దాడి చేసి చిన్న పిల్లలను దాడి చేసి చంపేస్తే ఒక్కరూ సమాధానం చెప్పలేదు. ఆ వీధి కుక్కల్లా బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజల పక్షాలు… అన్న సోయి కూడా లేదు. ఒక్క హామీ నిలబెట్టుకోకుండా, అన్ని వర్గాలను మోసం చేసి, నియంతలా పాలిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా ప్రతిపక్షాలను బయటకి కూడా రానివ్వడంలేదు. బీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు లేరు.. ఉన్నదల్లా గూండాలు మాత్రమే. పోలీసులను పనోళ్లలా వాడుకుంటూ అరెస్టులు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చాలా అవినీతికి పాల్పడ్డారు. డబ్బు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు గెలవాలని అనుకుంటున్నారు. కేసీఆర్ నియంత పాలనలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం వైయస్ఆర్ తెలంగాణ పార్టీకి లేదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నాం.. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా రాష్ట్రపతి పాలనకు విజ్ఞప్తి చేయాలని కోరుతున్నాం. మేం రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్లబోతున్నాం..తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతాం.

ప్రీతికి నా సానుభూతి ఉంది… ఆత్మహత్యా యత్నం చేసిన మరో మెడికల్ స్టూడెంట్ కు కూడా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ సానుభూతి ఉంది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదనడానికి ఎన్నో సంఘటనలు రుజువుగా ఉన్నాయి. పోడు భూముల కోసం కొట్లాడిన, మహిళలను జట్టు పట్టుకు లాక్కెళ్లారు, లాయర్లను నడి రోడ్డుపై నరికేసినా చర్యలే లేవు. రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదు. డ్రగ్స్ , ఆల్కహాల్ విచ్చలవిడిగా అందుబాటులో ఉంది. డ్రగ్స్ కుంభకోణలో పెద్దపెద్ద వాళ్లున్నారని పేర్లు వస్తున్నా ఎవ్వరినీ అరెస్ట్ చేయరు. ఇదేం పాలన.. ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? గవర్నర్ మేం చెప్పిన దానికి ఏకీభవించారు. ప్రెసిడెంట్ ని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావిస్తామన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్