Saturday, January 18, 2025
HomeTrending Newsహైదరాబాద్‌లో 100 టీకా కేంద్రాలు

హైదరాబాద్‌లో 100 టీకా కేంద్రాలు

పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కరోనా టీకా వేస్తామన్నారు. కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని కేంద్రానికి వెళితే వేచి చూడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్