రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ భాషా – సాంస్కృతిక, సాహిత్య అకాడమీ అధికారులను ఆదేశించారు.
CM KCR గారి సూచనల మేరకు గంగా జమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు భాషలలో రాష్ట్రస్థాయి లో 33 జిల్లాల్లో 3 విభాగాలైనా రచనం, పద్యం, ఉర్దూ కవిత్వం లలో కవి సమ్మేళనాలను రాష్ట్రస్థాయిలో రవీంద్ర భారతిలో నిర్వహించి ఎంపికైన ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా 1 లక్ష 116 రూపాయల ను, రెండవ బహుమతిగా 75 వేల 116 రూపాయలను, మూడోవ బహుమతిగా 60 వేల 116 రూపాయలను, చతుర్థ బహుమతి గా 50 వేల 116 రూపాయలు, పంచమ బహుమతిగా 30 వేల 116 రూపాయలు బహుమతిగా అందించి కవులను, సాహితి వేత్తల ను ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉత్తమ కవితలను కలిపి పుస్తక రూపంగా తీసుకురావాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 అకాడమీలను ఏర్పాటు చేసి ఆయా రంగాలలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి వారి అభిరుచులకు అనుగుణంగా ఆయా బాధ్యతలను సీఎం కేసీఆర్ గారు అప్పగించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత తెలంగాణ సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో నేటి తెలంగాణకు గల వ్యత్యాసాలను, జరిగిన అభివృద్ధిని ,ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని, వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాల అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య రంగాలలో జరిగిన అభివృద్ధి, విద్యుత్, సాగునీటి, త్రాగునీటి, సాంస్కృతిక ,పర్యాటకంగా, క్రీడలపరంగా జరిగిన అభివృద్ధిలపై కవులు ,సాహితి వేత్తలు తమ రచనలను కొనసాగించాలని మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కోరారు.
తెలంగాణ సాహిత్య దినోత్సవాన జూన్ 11వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కవులను సాహితివేత్తలను గుర్తించి వారిని సత్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కవి సమ్మేళనాలను నిర్వహించాలని తెలంగాణ సాహిత్య వైభవాన్ని దశ దిశల చాటాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈనెల 11వ తేదీన రాష్ట్ర స్థాయి సాహిత్య దినోత్సవం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సాహిత్య దినోత్సవం లో కవులు, సాహితివేత్తలు ఇదే ఆహ్వానంగా భావించి తెలంగాణ సాహిత్య దినోత్సవం లో పాల్గొనాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి, ఇతర అదికారులు పాల్గొన్నారు.