Sunday, January 19, 2025
Homeసినిమా20 కోట్ల గ్రాస్ సాధించిన '18 పేజెస్'

20 కోట్ల గ్రాస్ సాధించిన ’18 పేజెస్’

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2′ పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’18 పేజిస్’. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ మరియు రివ్యూస్ ను అందుకుంది. ’18 పేజెస్’ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు.దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందిని లా పాత్రలను మలిచిన తీరు, ఈ సినిమాలోని సాంగ్స్, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటి మించి సుకుమార్ మార్క్ తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ’18 పేజెస్’ సినిమా విడుదల రోజు నుండి మౌత్ టాక్ తో రోజురోజుకు సినిమాకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ సాధించి,విజయంతంగా ముందుకు సాగుతుంది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్