Saturday, November 23, 2024
HomeTrending NewsNirudyoga March: 11న సంగారెడ్డిలో బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’

Nirudyoga March: 11న సంగారెడ్డిలో బీజేపీ ‘‘నిరుద్యోగ మార్చ్’’

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యుడైన ఐటీ శాఖ మంత్రిని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన ప్రతీ నిరుద్యోగికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలనే డిమాండ్ తో ఈనెల 11న ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని సంగారెడ్డిలో ‘‘నిరుద్యోగ మార్చ్’’ నిర్వహించబోతున్నామన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ‘‘నిరుద్యోగ మార్చ్’’కు నిరుద్యోగులు, ప్రజాస్వామికవాదులంతా భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను దారణంగా మోసం చేసిన తీరును ఈ ‘‘నిరుద్యోగ మార్చ్’’ ద్వారా ప్రజల్లో ఎండగడతామని బండి సంజయ్ హెచ్చరించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి పదవికి రాజీనామా చేసేదాకా ఆందోళనలను ఉధ్రుతం చేస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా నిరుద్యోగుల పక్షాన పోరాడతామని భరోసా ఇచ్చారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ అనంతరం వచ్చే నెలలో హైదరాబాద్ లో ‘‘మిలియన్ మార్చ్’’ నిర్వహించి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. యూపీఎస్సీ తరహాలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తాం. లీకేజీకి ఆస్కారం లేకుండా పకడ్బందీగా పోటీ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్