2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 230 పని దినాలు ఉంటాయని ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. సమ్మర్ వెకేషన్ ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు ఉండనుంది.
మొదటి ఎఫ్ఏ( formative assessment )జులై 21 లోపు, ఎఫ్ఏ-2 పరీక్షలు సెప్టెంబర్ 5 లోపు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. ఇక ఎస్ఏ-1( summative assessment ) పరీక్షలు నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఎఫ్ఏ-3 ఎగ్జామ్స్ డిసెంబర్ 21 లోపు, ఎఫ్ఏ -4 పరీక్షలను పదో తరగతి విద్యార్థులకు జనవరి 31 లోపు, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28 లోపు నిర్వహించనున్నారు. 1 నుంచి 9 తరగతులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 28 లోపు టెన్త్ స్టూడెంట్స్‌కు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఎగ్జామ్స్ మార్చి నెలలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
పండుగల సెలవులు ఇవే..
దసరా సెలవులు – అక్టోబర్ 26 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు(14 రోజులు)
క్రిస్మస్ సెలవులు – డిసెంబర్ 22 నుంచి 28 వరకు(7 రోజులు)
సంక్రాంతి సెలవులు – జనవరి 13 నుంచి 17 వరకు(5 రోజులు)
Also Read : అవిభక్త కవలలకు అభినందనలు