Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రభుత్వంపై నిందలు సరికాదు

ప్రభుత్వంపై నిందలు సరికాదు

అమరరాజా బ్యాటరీ కంపెనీ తరలిపోవాలని తాము కోరుకోవడం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. కాలుష్య నియంత్రణ మండలి, చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాంతీయ కార్యాలయం ఇచ్చిన ఆదేశాలను ఆ కంపెనీ పాటించకుండా తమ ప్రభుత్వం ఏదో ఇబ్బందులు పెడుతున్నట్లు వ్యవహరించడం సరికాదని పెద్దిరెడ్డి సూచించారు. ఆ కంపెనీ చేస్తున్న వాదనలో పస లేదని, కేవలం ప్రభుత్వాన్ని, సిఎం జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా డ్యామేజ్ చేయడానికేనని అలా మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా కెమికల్ ఇండస్ట్రీస్ పదేళ్ళ తరువాత రీ లోకేట్ చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో నిబంధనలకు లోబడి వ్యవహరించకుండా  ప్రభుత్వం నిర్ణయాలపై కోర్టుకెక్కి స్టే తెచ్చుకోవడం సమర్ధనీయం కాదని పేర్కొన్నారు.

పరిశ్రమల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అలాంటప్పుడు ఏ పరిశ్రమ అయినా వెళ్లిపోవాలని ప్రభుత్వం కోరుకోదని తేల్చి చెప్పారు. అయితే నిబంధనలకు లోబడి పరిశ్రమలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. చిత్తూర్ వద్ద షుమారు ఐదువేల ఎకరాలు అమర రాజా కంపెనీ తీసుకుందని, అక్కడికి తరలించవచ్చు కదా అని ప్రశ్నించారు. మరో రాష్ట్రం కొన్ని అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు హామీ ఇచ్చిందని అక్కడికి తరలిస్తున్నారని,  దాని కోసం ఈ ప్రభుత్వపై నిందలు వేయాల్సిన అవసరం లేదని సూచించారు.

ఏపీలో పంచాయతీరాజ్ శాఖలో 25 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించామని పెద్దిరెడ్డి తెలిపారు. వారు ఏ జాబ్ లో అయితే జాయిన్ అయ్యారో దానిలోనే 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నారని తెలిపారు.  ఐసిడిఎస్ నుంచి 39 మంది, డైరెక్ట్ రిక్రూట్ అయినవారు 140, ఈవోఆర్డీల నుంచి ప్రమోషన్ పొందినవారు 136 మొత్తం కలిపి 315 మంది ఎంపిడివోలుగా చేరి ప్రమోషన్లు లేకుండా ఉన్నారని… వీరికి ప్రమోషన్ రాకపోవడం వల్ల పంచాయతీరాజ్ శాఖలో 12 ఇతర పోస్టుల్లో కొనసాగుతున్న దాదాపు 18,500 మంది ఉద్యోగులు కూడా ప్రమోషన్లు లేకుండా కొనసాగుతున్నారని వివరించారు. ఈరోజు 255 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు మంచి పనితీరు చూపాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్