Saturday, January 18, 2025
HomeTrending News252 బ్లాక్ ఫంగస్ కేసులు: సింఘాల్

252 బ్లాక్ ఫంగస్ కేసులు: సింఘాల్

కరోనా వ్యాప్తితో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి బ్లాక్ ఫంగస్ మరో సమస్యగా మారింది. బ్లాక్ ఫంగస్ తో మరణిస్తున్న ఘటనలు నమోదు అవుతుండడంతో అధికారులు దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు.

ఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఇంజెక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో 3 వేల ఇంజెక్షన్లను జిల్లాలకు పంపామని తెలిపారు. రాష్ట్రంలో రెమ్ డెసివిర్ కొరత లేదని సింఘాల్ స్పష్టం చేశారు. తుపాను దృష్ట్యా ముందస్తుగా 767 టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉంచామని వెల్లడించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్