Sunday, January 19, 2025
Homeసినిమాస‌ర్కారు వారి రెండో రోజు క‌లెక్ష‌న్స్ ఎంత‌.?

స‌ర్కారు వారి రెండో రోజు క‌లెక్ష‌న్స్ ఎంత‌.?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ ‏లోనూ మంచి కలెక్షన్స్ రాబ‌డుతోంది. ఈ సినిమా మహేష్‌ స్టామినా ఏంటో మరోసారి చూపించింది.

తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల వసూళ్ళు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనే 36.89 కోట్ల షేర్ రాబట్టి నాన్-ఆర్ఆర్ఆర్ రికార్డ్ నమోదు చేసింది. అయితే రెండో రోజు శుక్రవారం నార్మల్ వర్కింగ్ డే అవ్వడంతో మార్నింగ్ ఫో, మ్యాట్నీ షోలకు డ్రాప్స్ కనిపించాయి. మళ్ళీ ఈవెనింగ్ అండ్ నైట్ షోలకు మాత్రం జోరు చూపించింది.

ఇక రెండో రోజు క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. నైజాం – 5.2 కోట్లు, సీడెడ్ – 1.45 కోట్లు, యూఏ – 1.65 కోట్లు, ఈస్ట్ – 1.08 కోట్లు, వెస్ట్ – 45 లక్షలు, గుంటూరు – 51 లక్షలు, కృష్ణ – 89 లక్షలు, నెల్లూరు – 41 కోట్లు మొత్తం – 11.64 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 48.53 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ఏలో మహేష్‌ బాబు మూవీ భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రీమియర్స్ తో కలుపుకుని ఇప్పటి వరకు $1.5+ మిలియన్ కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. మహేష్ కెరీర్ లో యుఎస్ లో ఈ మార్క్ క్రాస్ చేసిన 8వ సినిమాగా నిలిచింది.

Also Read : సర్కారుకు తొలిరోజు భారీ కలెక్షన్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్