కేతిక శర్మ .. కుర్రాళ్ల కలల రాణి. బరువైన అందాలతో వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసే ఊహా సుందరి. తెలుగు తెరపై గుమ్మడి పువ్వులా కనిపించే ఈ అమ్మాయి చుట్టూ కుర్రాళ్లంతా కంటి దీపాలు వెలిగించారు. అభిమానులుగా మారిపోయి అదేపనిగా ఆరాధిస్తున్నారు. తొలి సినిమా ‘రొమాంటిక్’కి సంబంధించిన పోస్టర్ నుంచి ఇంతవరకూ ఎవరూ తన వైపు నుంచి కళ్లు తిప్పుకోకుండా చేస్తూనే వచ్చింది. బలమైన కథాకథనాలు లేకపోవడం వలన, ఆమె అందాల ప్రదర్శన ‘రొమాంటిక్’ ను కాపాడలేకపోయింది.
ఆ తరువాత ఆమె ‘లక్ష్య’ సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె అందాల ప్రదర్శనకి కూడా పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఆ రెండు సినిమాలు కూడా ఆమెకి ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయాయి. దాంతో ఆమె తన మూడో సినిమా అయిన ‘రంగ రంగ వైభవంగా‘ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా ఫలితం కూడా ఆమెను నిరాశ పరిచింది. దాదాపు 20 ఏళ్ల క్రితమే వచ్చిన కథలకు దగ్గరగా ఈ సినిమాను తీసుకుని వెళ్లడమే మైనస్ గా మారింది. దాంతో కొత్త కథలను చూస్తున్న అనుభూతి ప్రేక్షకులకి లేకుండా పోయింది.
కథ పాతది కావడంతో .. పసందైన పాటలు కూడా ఈ సినిమాను ఆదుకోలేకపోయాయి. నిజానికి ఈ సినిమాలో గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా కేతిక ఆకట్టుకుంది. ఈ పిల్లలో ఇంత విషయం ఉందా అన్నట్టుగా చేసింది. కంటెంట్ ఉన్నప్ప్పటికీ కాలం కలిసిరాలేదు పాపం. వరుసగా మూడు సినిమాలు పోయాయి. ఇకపై ఇంత ఫాస్టుగా అవకాశాలు రాలేకపోవచ్చు. ఒకవేళ వస్తే కచ్చితంగా ఆ సినిమాలు హిట్ కొట్టవలసిందే. లేదంటే ఇప్పుడున్న పోటీని తట్టుకుని ముదుకువెళ్లడం ఈ ముద్దుగుమ్మకు కష్టమే అవుతుంది.
Also Read : పాత కథకు కొత్త రంగులద్దితే ‘రంగరంగ వైభవంగా’