Monday, March 16, 2026
Homeసినిమాగంధ‌ర్వ నుంచి 'కన్నులకే  కానుకవే' పాట

గంధ‌ర్వ నుంచి ‘కన్నులకే  కానుకవే’ పాట

Kannulave: జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా, మలయాళీ బ్యూటీ గాయత్రి ఆర్.సురేష్, శీతల్ భట్ హీరోయిన్స్  గా నటిస్తున్న చిత్రం ‘గంధర్వ‘.  కథాపరంగా, సాంకేతిక పరంగా, సంగీత పరంగా, మేకింగ్ పరంగా ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది అంటున్నారు చిత్ర దర్శక రచయిత అఫ్సర్ హుస్సేన్.  ఈ చిత్రం నుండి మొదటి పాటను నెల రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు బాబీ విడుదల చేశారు.

యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పణలో ఫన్నీ ఫాక్స్  ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మితమైన యాక్షన్ థ్రిల్లర్ ‘గంధర్వ’ చిత్రం నుండి  రెండవ పాటను రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట‌ విడుదలైంది. ధనుంజయ్, మోష్మి నేహా ఆలపించిన  ‘కన్నులకే  కానుకవే…. చిన్ని గుండెకే  ఊపిరివే… వెన్నెలకే వెలుతురువే … గుండెలలో సవ్వడివే …’ అన్న పల్లవితో ఆహ్లాదకరమైన సాహిత్యంతో సాగిన ఈ గీతానికి  సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ అద్భుతమైన మెలోడియస్ ట్యూన్  సమకూర్చారు .

సీనియర్ హీరోలు సాయి కుమార్ సురేష్ లతో పాటు బాబు మోహన్, పోసాని కృష్ణ మురళి, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ రోహిణి, మధు నంబియార్, అమెరికా జై రామ్,  రూపాలక్ష్మి , పింగ్ పాంగ్ సూర్య, ఆర్జీవీరామ్, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు ముఖ్య భూమికలు పోషించిన గంధర్వ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మార్చి మూడవ వారంలో ఫస్ట్ కాపీ సిద్ధమౌతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read : సందీప్ మాధవ్ ‘గంధర్వ’ మోషన్ పోస్టర్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular