Sunday, January 19, 2025
Homeసినిమాతండ్రీ కూతుళ్ళతో సర్కారు రెండో సాంగ్

తండ్రీ కూతుళ్ళతో సర్కారు రెండో సాంగ్

Father-Daughter: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’. వేసవిలో అభిమానులకు ‘సూపర్ స్పెషల్’ ట్రీట్‌ను అందించడానికి మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది, రెండవ పాట, పెన్నీ వీడియో సాంగ్ ద్వారా మహేష్ బాబు కుమార్తె సితార సిల్వర్ స్క్రీన్ కి తొలిసారిగా పరిచయమైంది. ఈ పాట తండ్రీ-కూతుళ్ళ ద్వయం అందమైన నృత్యంతో రూపొందింది. ముందుగా నిన్న విడుదలైన ఈ పాట ప్రోమోకు విశేష స్పందన లభించింది.

సితార ఒక రాక్‌స్టార్ లా తన డ్యాన్స్ నైపుణ్యాలతో ఆకట్టుకుంది. దానితో పాటు తన హావభావాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ బాబు చాలా అందంగా కనిపించాడు, తన స్టైల్ తో మెస్మరైజ్ చేసాడు. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 3 మిలియ‌న్ కు పైగా వ్యూస్ తో దూసుకెళుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది. సినిమా నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్