నిన్నటి తిరుపతి ర్యాలీతోనైనా మూడు రాజధానులపై రాయలసీమ మనోభావాలేమిటో ప్రతిపక్ష నేత చంద్ర బాబునాయుడు తెలుసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి సూచించారు. బాబుకు తోడు నీడగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కూడా వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించాలన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయణ స్వామి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
పరిపాలనా వికేంద్రీకరణకు ఇదే సరైన సమయమని, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం ఎదుర్కొన్న పరిస్థితి భవిష్యత్తులో ఇక్కడ కూడా వస్తుందన్నారు, దీన్ని దృష్టిలో ఉంచుకునే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కావాలన్న లక్ష్యంతో, ప్రజల సుఖ సంతోషాల కోసమే సిఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
నవరత్నాలకు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చంద్రబాబుకు, ఆయనకు మద్దతిస్తున్న ఎల్లో మీడియాకు మైండ్ సెట్ మార్చాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు నారాయణస్వామి వ్యాఖ్యానించారు.