Sunday, January 19, 2025
HomeTrending Newsకెసిఆర్ వి ఫ్యూడలిస్టు ఆలోచనలు - కోదండరాం

కెసిఆర్ వి ఫ్యూడలిస్టు ఆలోచనలు – కోదండరాం

317 G.O : రాజ్యాంగం మారుస్తా అనే చర్చ తెస్తే కేసీఆర్ తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. పోరాటాలతో తెచ్చుకున్న రాజ్యాంగం మార్చి ఏ రాజ్యాంగం తెస్తా అనుకుంటున్నావు కేసీఆర్ అని ప్రశ్నించారు. కెసిఆర్ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉదృతం చేస్తామని కోదండరాం ఈ రోజు హైదరాబాద్ లో ప్రకటించారు. 317జీవో ను సవరించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. ఫ్యూడల్ ఆలోచనలు ఉన్న కేసీఆర్ కు రాజ్యాంగం ఏం అర్థం అవుతుందని, నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యాంగం మార్పు చేస్తాం అంటున్నారని విమర్శించారు.

తెలంగాణలో అప్రజాస్వామిక.. అరాచక పాలనను ఎదుర్కునేందుకు త్వరలోనే ప్లీనరీ నిర్వహించుకుని.. తీర్మాణాలు చేస్తామని కోదండరాం తెలిపారు. ఇరిగేషన్ సెక్రటరీ పై వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదని, ప్రభుత్వ సొమ్ముతో విలాసాలు.. విందులకు ఖర్చు చేస్తా అంటె చూస్తూ ఊరుకోమని కోదండరాం వార్నింగ్ ఇచ్చారు. తమ పోరాటానికి అన్ని సంఘాల సహకారం తీసుకొని కలిసి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కేంద్ర బడ్జెట్, కరోనా తరువాత ఆర్థిక అసమానతలు పెంచేలా ఉందని, పేదరికాన్ని నిర్మూలించేందుకు బడ్జెట్ రావాల్సి ఉందని కోదండరాం అన్నారు.

మనుషుల మధ్య అంతరాలు తొలగించేందుకు రాజ్యాంగం ఉపయోగపడుతుంది అని అంబేద్కర్ చెప్పారని, కేంద్ర ప్రభుత్వంను తిడుతున్నట్టు కనిపించే కేసీఆర్ అదే పంథాను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. ఎప్పుడు ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడని, ప్రజలు అణిచివేతకు గురవుతున్నారన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా లాఠీ చార్జి చేశారని, ముఖ్యమంత్రికి చెప్పుకుందాం అని బయలుదేరి తే మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేశారన్నారు. మల్లన సాగర్ బాధితులను 144సెక్షన్ పెట్టి లాఠీ ఛార్జ్ చేయించైనా సిఎం కెసిఆర్ యువకులు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. పీజీ.. పీహెచ్డీ చేసిన వారు ఖాళీగా ఉన్నారని, 50వేల ఉద్యోగాలు ఇస్తమని అంటున్నారు.. దానమా ధర్మమా అని ప్రశ్నించారు. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాల్సిందేనని, ఇప్పటికీ బతుకుదేరువు లేక దుబాయ్, ముంబాయి పోయి నిరుద్యోగ యువత అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ రాజ్యాంగం రాస్తా అంటే అది నిరంకుశ రాజ్యాంగం అయి ఉంటుందని, అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటుచేసారు.. ఆ తప్పుని కప్పి పుచ్చు కోవడం కోసం స్థానికత అంటున్నారని విమర్శించారు. స్థానికతకు గుర్తింపు లేకుండా చేసేందుకే 317 జీవో తీసుకొచ్చారని, 317, 124రెండు జీవో లకు తూట్లు పొడిచారని, ఉద్యోగులు నీ సెక్యూరిటీ గార్డులు కాదు.. నీ ఫాం హౌస్ లో కూలీలు కాదు…ఉద్యోగులతో నియమనిబంధనలకు అనుగుణంగా మాట్లాడాలని, 317జీవో రాజ్యాంగ విరుద్ధం.. ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : మార్చురీల ఆధునికీకరణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్