Saturday, March 14, 2026
HomeTrending Newsటీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల వంటకాలు

టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల వంటకాలు

33 Variety Recipes : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నోరూరించే వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. ప్లీన‌రీలోని వంట‌ల ప్రాంగ‌ణం రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో ఘుమ‌ఘుమ‌లాడుతోంది. క‌డుపు నిండా భోజ‌నం వ‌డ్డించేందుకు వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 33 ర‌కాల వెరైటీల‌ను ఏర్పాటు చేశారు.

33 ర‌కాల వెరైటీలు ఇవే..
డబుల్‌ కా మీట, గులాబ్‌ జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌, మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీ దాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా, వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ, వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌,టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌ తదితర వంటకాలు మెనులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular