34th Hyderabad National Book Fair Kicks Off :
34వ హైదరాబాద్ జాతీయ బుక్ ఫెయిర్ లో భాగంగా బుధవారం నగరంలోని ఎన్.టి.ఆర్ స్టేడియంలో ఆకుపచ్చని అక్షరం పర్యావరణ సాహిత్య సమ్మేళన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, CMO ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, సిటి కాలేజ్ ప్రిన్సిపాల్ బాలాభాస్కర్, పర్యావరణ వేత్త వేదకుమార్, సీతారాం, ప్రొఫెసర్ నీరజ, కోయి కోటేశ్వరరావు తదితర సాహితీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దాని గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ఒక్కరు 3 మొక్కలు నాటి మరోక ముగ్గురికి చాలెంజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
సందర్భం ఏదైనా అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు,పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కూడా మొక్కలు నాటే విధంగా చైతన్యం తీసుకురావడం జరిగిందని అన్నారు. మూడు మొక్కలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నేడు దాదాపు 16 కోట్ల మొక్కలకు చేరుకుందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం కోసం ముందు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జగన్ పెళ్లి సంతోష్ కుమార్ కృషిని వక్తలు ప్రశంసించారు. ఇదే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కొనసాగిస్తూ పచ్చదనం పెంచడం కోసం పర్యావరణం పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.