Saturday, January 18, 2025
Homeసినిమా'36 డేస్' వెబ్ సిరీస్ .. ఆ రోజుల్లో జరిగేది ఇదే!

’36 డేస్’ వెబ్ సిరీస్ .. ఆ రోజుల్లో జరిగేది ఇదే!

ఈ మధ్య కాలంలో ఎక్కువ కుతూహలాన్ని రేకెత్తించిన వెబ్ సిరీస్ లో ’36 డేస్’ ఒకటి. టైటిల్ తో పాటు, నేహా శర్మ హాట్ లుక్స్ తో కూడిన ట్రైలర్ ఈ సిరీస్ పై అందరిలో ఆసక్తిని పెంచింది. విలాసవంతమైన విల్లాల మధ్య జరిగే మర్డర్ మిస్టరీగా ప్రేక్షకులు భావించారు. సోనీ లివ్ లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నేహా శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి విశాల్ ఫురియా దర్శకత్వం వహించాడు. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ ఇప్పుడు మంచి రేటింగ్ తో ముందుకు వెళుతోంది.

అది సముద్ర తీరంలో ఉన్న విలాసవంతమైన విల్లాల ప్రాంతం. అక్కడ కొన్ని కుటుంబాలవారు నివసిస్తూ ఉంటారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో కథ ఉంటుంది. కావలసినంత డబ్బు .. కోరుకున్న విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు మాత్రం ఉండవు. రహస్య జీవితాలు వారి మధ్య మనస్పర్థలు సృష్టిస్తూ ఉంటాయి. దాంతో సహజంగానే వారి ఆలోచనలు ఇతర ఆకర్షణల దిశగా మళ్లుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే ‘ఫరా’ అనే ఒక అందమైన యువతి ఆ విల్లాల మధ్యలోకి వస్తుంది.

ఫరా అద్దెకి దిగిన దగ్గర నుంచి అక్కడ అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. తమ భర్తలను ఆమె ఎక్కడ వలలో వేసుకుంటుందోననే అభద్రతా భావంలోకి వాళ్ల భార్యలంతా వెళ్లిపోతారు. అదే ఫరా పట్ల వాళ్లందరికీ ద్వేషం కలగడానికి కారణమవుతుంది. ఓ రోజున తెల్లవారేసరికి ఫరా శవమై కనిపిస్తుంది. ఆమెను ఎవరు హత్య చేశారు? ఈ హత్యకి ముందు 36 రోజులుగా ఏం జరిగింది? అనేదే కథ. ఈ కథ కొత్తదేం కాకపోయినా, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు. అలా కాకుండా నిదానంగా సాగదీస్తూ వెళ్లారు. అందువలన ప్రేక్షకులు కాస్త ఓపిక చేసుకోవాలంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్