Thursday, March 19, 2026
HomeTrending NewsVoters List: ఆ దొంగ ఓట్లు మీ హయంలోవే: పెద్దిరెడ్డి

Voters List: ఆ దొంగ ఓట్లు మీ హయంలోవే: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.  శ్రీ సత్యసాయి జిల్లా  మడకశిరలో మాజీ ఎమ్మెల్యే వైసీ తిమ్మారెడ్డి విగ్రహాన్ని పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, ఇవన్నీ గత తెలుగుదేశం పాలనలో చేర్పించినవేనని అన్నారు.  దొంగ ఓట్ల పై తాము కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో తాము సింగిల్ గానే పోటీ చేస్తామని పెద్దిరెడ్డి పునరుద్ఘాటించారు. జనసేన, బిజెపిలతో పోత్తులకు బాబు వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు సిఎం జగన్ వెంటే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లోనూ గతంలో లాగానే బారీగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular