Sunday, January 19, 2025
HomeసినిమాRe-release: ఇది రీ రిలీజ్ ల టైమ్ గురూ!

Re-release: ఇది రీ రిలీజ్ ల టైమ్ గురూ!

ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయితే, ఆ తరువాత కాలంలో మళ్లీ ఆ సినిమాను రీ రిలీజ్ చేసేవారు. అలాంటి సినిమాలు మారుమూల గ్రామాల్లో సైతం ఎక్కడో ఒక థియేటర్లో కనిపిస్తూనే ఉండేవి. ఆ తరువాత కాలంలో ట్రెండ్ మారిపోవడంతో, ఒకసారి హిట్ అయిన సినిమాలు టీవీలలో తప్ప మరెక్కడా కనిపించేవి కావు. ఇక ఇప్పుడు టీవీలతో పాటు యూ ట్యూబ్ లలో .. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కూడా, గతంలో హిట్ కొట్టిన సినిమాలను చూసే అవకాశం ప్రేక్షకుడి ముందుకు వచ్చింది.

ఇలాంటి సమయంలోనే అనుకోకుండా మొదలైన ఒక ప్రయత్నం ఒక ట్రెండుగా మారిపోయింది. అదే ఈ తరం స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను ఏదో ఒక సందర్భంలో థియేటర్స్ కి తీసుకొచ్చే ట్రెండ్. ముఖ్యంగా హీరోల బర్త్ డే సందర్భాలను పురస్కరించుకుని ఈ సినిమాలు కొన్ని ప్రాంతాలలో .. కొన్ని థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. రీసెంటుగా ‘బిజినెస్ మెన్’ కూడా అలా వచ్చిందే. అలా వచ్చిన సినిమాలకి విశేషమైన ఆదరణ లభించడం .. భారీ వసూళ్లను కూడా రాబడుతూ ఉండటంతో ఈ జోరు కొనసాగుతోంది.

ఇప్పుడు ఈ ట్రాక్ పైకి అనువాద చిత్రాలు కూడా వస్తుండటం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. ధనుశ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఒకటిగా ‘రఘువరన్ బీటెక్’ కనిపిస్తుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీవీల్లోను చాలాసార్లు వచ్చింది. అయినా ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు మరోసారి రావడానికి ‘7G బృందావన కాలనీ’ సిద్ధమవుతోంది. రవికృష్ణ – సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా 2004లో విడుదలై, యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తే, మరిన్ని అనువాదాలు రీ రిలీజ్ ట్రాక్ పైకి రావడం ఖాయమనే చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్