Thursday, March 12, 2026
HomeTrending NewsMedical Colleges: తెలంగాణలో మ‌రో 8 వైద్య కళాశాలలు

Medical Colleges: తెలంగాణలో మ‌రో 8 వైద్య కళాశాలలు

రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రికి మెరుగైన వైద్యం అందించాల‌నే ఉద్దేశంతో.. ప్ర‌తి జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌ద్వారా మెడిసిన్ చ‌ద‌వాల‌న్న స్థానిక విద్యార్థుల క‌ల కూడా నెర‌వేరుతుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే దాదాపు అన్ని జిల్లాల్లో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వ‌చ్చాయి. తాజాగా మ‌రో 8 కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, జోగులాంబ గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట్, మెద‌క్, ములుగు, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఒక్కో జిల్లాకు ఒక్క మెడిక‌ల్ కాలేజీ ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ క‌ల సాకారం అవుతోంది. ప్ర‌తి జిల్లాకు ఒక ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ క‌లిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీంతో తెలంగాణ దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుంది. ఈ 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేసింది. ఈ మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10 వేల‌కు చేరువ కానున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ‌య్యాయి. స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి వాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular