ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల కలిసి జనతా గ్యారేజ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అప్పటి నుంచి మరో సినిమా చేయాలి అనుకుంటే.. ఇప్పటికి సెట్ అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా దేవర షూటింగ్ జరుపుకుంటుంది.
లేటెస్ట్ గా అయితే మేకర్స్ ఫ్యాన్స్ ని రిలీజ్ డేట్ పట్ల అలర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తో దేవర ఆగమనం మరో 250 రోజుల్లో ఉంది అంటూ సాలిడ్ పోస్ట్ ని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. దీనితో ఎట్టి పరిస్థితుల్లో ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 5 న 2024లో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అని మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ ల పై ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ ల పై భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. కొరటాల తెరకెక్కించిన ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో కథ పై చాలా సార్లు కసరత్తు చేశారు. ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిన తర్వాతే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్, కొరటాల ఈ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర పై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే.. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం అంటున్నారు మేకర్స్.