Saturday, September 21, 2024
Homeసినిమామహేష్ తో రాజమౌళి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?

మహేష్ తో రాజమౌళి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టుగా రాజమౌళి ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రాజమౌళి తన ప్రతి సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు వర్క్ షాపు నిర్వహిస్తుంటారు. ఈ సినిమా కోసం కూడా వర్క్ షాపు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి వర్క్ షాపు స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. మహేష్ బాబుతో జక్కన్న చేయనున్న మూవీలో మరో హీరో పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. బాలయ్య ఇందులో నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఆతర్వాత బాలకృష్ణ కాదని తెలిసింది. ఆతర్వాత ఇందులో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ విలన్ గా నటించనున్నారని ఇండస్ట్రీలో బాగా వినిపించింది. అమీర్ ఖాన్ ఎప్పటి నుంచో రాజమౌళితో సినిమా చేయాలి అనుకుంటున్నారు. అందుచేత ఇది నిజమేనేమో అనుకున్నారు కానీ.. రాజమౌళి ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులు గురించి ఆలోచించడం లేదట. ఇంకా స్ర్కిప్ట్ వర్క్ లోనే ఉన్నారని తెలిసింది.

తాజాగా ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా తీయనున్నారని.. రెండో పార్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరో వార్త ఏంటంటే.. మహేష్‌ బాబు పుట్టినరోజు ఆగష్టు 9న. ఆ రోజున ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ కి పూర్తి చేసి డిసెంబర్ నుంచి మహేష్ జక్కన మూవీ వర్క్ షాపులో జాయిన్ కానున్నారని తెలిసింది. అయితే.. రాజమౌళి మహేష్ తో చేసే సినిమా మల్టీస్టారరా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్