Thursday, March 12, 2026
Homeసినిమాషూటింగ్ స్పాట్ లో మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్

షూటింగ్ స్పాట్ లో మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్

‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా  నటిస్తోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ (VD13) పదమూడో చిత్రంగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో (SVC54) 54వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి  వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.  రీసెంట్‌గా సినిమా టీం అంతా కలిసి లోకేషన్ల వేటను పూర్తి చేశారు. సినిమా లొకేషన్ల రెక్కీ పూర్తయిన సంగతిని మేకర్లు ప్రకటించి.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని అప్డేట్ ఇచ్చారు. మొత్తానికి ఇప్పుడు షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది.

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ‘సీతారామం’ లో సీత పాత్రలో నటించి మెప్పించారు. నేడు (ఆగస్ట్ 1) ఆమె పుట్టిన రోజు సందర్భంగా సెట్‌లో ఆమె బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది చిత్రయూనిట్.  ఆమె చేత కేక్ కట్ చేయించారు. ఈ సెలబ్రేషన్స్ లో నిర్మాత హన్షిత రెడ్డి, శిరీష్‌లు కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular