Friday, March 13, 2026
Homeసినిమా'భోళాశంకర్' ప్రీ రిలీజ్ ఎప్పుడు..? ఎక్కడ.?

‘భోళాశంకర్’ ప్రీ రిలీజ్ ఎప్పుడు..? ఎక్కడ.?

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘భోళాశంకర్’. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో చిరుకు జంటగా తమన్నా నటిస్తే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. హీరో సుశాంత్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. భోళాశంకర్ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి అనే ఫీలింగ్ కలిగించింది. ఆగష్టు 11న భోళా శంర్ మూవీని విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్.

భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే.. ఈ నెల 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేశారని తెలిసింది. అయితే.. ఎక్కడ చేయనున్నారు..? హైదరాబాద్ లోనా..? విజయవాడలోనా..? అనేది తెలియాల్సివుంది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన చిరంజీవి ఈ సినిమాతో కూడా విజయం సాధించాలి అనుకుంటున్నారు. మరి.. భోళాశంకర్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular