Tuesday, June 16, 2026
Homeసినిమారజినీ జైలర్ ట్రైలర్ టాక్ ఏంటి..?

రజినీ జైలర్ ట్రైలర్ టాక్ ఏంటి..?

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘జైలర్’. ఈమధ్య కాలంలో రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోకవడంతో బోల్తాపడుతున్నాయి. దీంతో జైలర్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ టీజర్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆగష్టు 10న జైలర్ చిత్రాన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇప్పుడు జైలర్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

మరి.. ట్రైలర్ టాక్ ఏంటంటే.. ట్రైలర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తిగా ఉంది. పవర్ ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో అదిరింది అనే ఫీలింగ్ కలిగించింది. సినిమా పై మరింత అంచనాలను పెంచేసింది. ఎప్పటిలాగే రజనీకాంత్ తన పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీతో కనిపించారు. ఇంకా చెప్పాలంటే.. రజనీ యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఈ ట్రైలర్ చివరిలో హుకుం అంటూ రజినీ పాత్రను మరింతగా ఎలివేట్ చేశారు. ఇక తమన్నా సాంగ్ అయితే.. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ట్రైలర్ అదిరింది. మరి.. సినిమా అదిరింది అనేలా ఉంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular