Thursday, March 19, 2026
HomeసినిమాTamannah: తమన్నా కెరియర్లో ఇది అరుదైన అనుభవమే!

Tamannah: తమన్నా కెరియర్లో ఇది అరుదైన అనుభవమే!

తమన్నా చాలా చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ, స్టార్ డమ్ ను సంపాదించుకోవడానికి ఆమె ఎక్కువ సమయం తీసుకోలేదు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఇప్పుడు ఆమె సీనియర్ స్టార్ హీరోయిన్. చాలా అరుదుగా సాధ్యమయ్యే సుదీర్ఘమైన ప్రయాణం తమన్నా కెరియర్లో కనిపిస్తుంది. చాలామంది కొత్త హీరోయిన్స్ వచ్చినా ‘మిల్కీ బ్యూటీ’గా ఆమె స్థానం మాత్రం చెక్కు చెదరలేదు.

అలాంటి తమన్నా ఇంతకుముందు చాలానే భారీ సినిమాలు చేసింది. అదే స్థాయిలో భారీ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. అలాంటి తమన్నాకి ఇప్పుడు ఈ నెల విడుదలవుతున్న ‘భోళా శంకర్’ .. ‘జైలర్’ సినిమాలు ప్రత్యేకమైనవిగా ఆమె కెరియర్లో నిలిచిపోనున్నాయి. రజనీకాంత్ సరసన నాయికగా ఆమె చేసిన ‘జైలర్’ ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది.

ఇక తెలుగులో ఈ నెల 11వ తేదీన విడుదలవుతున్న ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా ఆమె సందడి చేయనుంది. ఇలా ఒక వైపున సూపర్ స్టార్ తోను .. మరో వైపున మెగా స్టార్ తోను తమన్నా చేసిన సినిమాలు ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం అరుదైన విషయంగానే భావించాలి. ఈ రెండు సినిమాలు హిట్ కొడితే అది కూడా తమన్నా తన కెరియర్లో మరిచిపోలేని సందర్భమే అవుతుంది. అటు రజనీ .. ఇటు చిరూ అభిమానులు మాత్రం ఈ రెండు సినిమాల కోసం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular