Saturday, November 23, 2024
HomeTrending NewsPawan: రిషికొండపై యధేచ్చగా ఉల్లంఘన: పవన్

Pawan: రిషికొండపై యధేచ్చగా ఉల్లంఘన: పవన్

చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి  స్వయంగా ఉల్లంఘిస్తున్నారని… కానీ విపక్షాలు శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండపై అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, పర్యావరణ చట్టాలను అతిక్రమిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుందని చెప్పారు. గతంలో తెలంగాణను కూడా  ఇలాగే దోచేశారని, అందుకే తన్ని తరిమేశారని వ్యాఖ్యానించారు. కర్నూలు లో న్యాయ రాజధాని అని చెప్పిన వ్యక్తి కనీసం లోకాయుక్త ఆఫీసు కూడా పెట్టలేదని, అలాంటిది మూడు రాజధానులు అంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ పోలీసు ఆంక్షల మధ్య రిషికొండను పరిశీలించారు. జోగుళ్ళపాలెం వద్ద అభిమానుల వాహనాలను నిలిపివేసిన పోలీసులు పవన్ తో పాటు మరో 7 వాహనాలను మాత్రమే అనుమతించారు. కొండపైకి వెళ్ళే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు మీద నుంచే పవన్ రిషికొండపై నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు.

ఈ దోపిడీ అందరికీ తెలియాలని అందుకే తాను వెలికి తీస్తున్నానని చెప్పారు.  తెలంగాణను దోచుకున్న వారి కన్ను ఇప్పుడు ఉత్తరంధ్రపై పడిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను అడ్డంగా దోచేస్తున్నారని, ముఖ్యమంత్రికి ఎన్ని ఇల్లు కావాలని, సిఎంకు వ్యూ కావాలా, సర్క్యూట్ హౌస్ ను తాకట్టు పెట్టి రిషి కొండను దోచేస్తారా అని నిలదీశారు. పవన్ మీడియా వాహనం పైకి ఎక్కి రిషికొండను పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్