Thursday, March 19, 2026
Homeసినిమానాగ్ తో 'బిగ్ బాస్ 7' ప్రయత్నం ఫలించేనా..?

నాగ్ తో ‘బిగ్ బాస్ 7’ ప్రయత్నం ఫలించేనా..?

బిగ్ బాస్ ఓ పెద్ద గేమ్ షో. ఇది బుల్లితెర పై ఓ సంచలనం. ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. వాటన్నింటికీ భిన్నంగా రూపొందించడం వలన బిగ్ బాస్ షో బాగా సక్సెస్ అయ్యింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 1 కు ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తే.. బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వచ్చారు. ఇక మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. అయితే.. ఆరవ సీజన్ కు అంతగా ఆదరణ లభించలేదని.. ఏడవ సీజన్ కు హోస్ట్ గా నాగార్జునను కాకుండా వేరే స్టార్ తో చేయించనున్నారని ప్రచారం జరిగింది.

నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ ఇలా కొంత మంది స్టార్ హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ 7వ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా ఫైనల్ చేయడం విశేషం. బిగ్ బాస్ 7 ప్రొమోలు రిలీజ్ చేశారు. ఈ ప్రొమోలు చూస్తుంటే.. నిజంగానే ఈసారి బాగా కసరత్తు చేసినట్టు అనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రొమో కూడా ఇంట్రస్టింగ్ గా ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ స్పష్టం చేస్తున్నారు.

ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు. అంతా ఉల్టా పుల్టా అంటూ ఈ సీజన్ 7 పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. దీంతో బిగ్ బాస్ 7 హౌస్ లోకి వచ్చేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. కొంత మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అలా ప్రచారంలోకి వచ్చిన పేర్లలో జర్నలిస్ట్ సురేష్ కొండేటి పేరు బాగా వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి.. బిగ్ బాస్ 7 ఎంత వరకు మెప్పిస్తుందో.. నాగ్ తో చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..? రేటింగ్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular