తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విలువైన వృక్షాలకు రియల్ టైం ప్రొటెక్షన్ చీప్ పరికరాన్ని తెలంగాణలో మొదటిసారిగా బోటానికల్ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి చేతులమీడిగా ఆవిష్కరించడం జరిగింది.
సి. బి. ఐ. ఓ. టి. టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు, ఈ ప్రొటెక్షన్ సిస్టం అనే సెన్సర్ పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈయొక్క పరికరంతో చందనము ఎర్రచందనము వంటి విలువైన వృక్షాలను దొంగతనం కానీ కొట్టేయడం కానీ smuggling కాకుండా నిరోధించే ఎలక్ట్రానిక్ పరికరము నూతనంగా తయారు చేయబడినది.
ఇది 3.6 వాల్ట్స్ లైతిమ్ ఇయన్ (Lithium Ion) బ్యాటరీస్ తో పని చేస్తుంది. ఈ యొక్క పరికరము చెట్లను ఎవరైనా కోటేస్తున్నా, ఎవరైనా దొంగలించాలని పికిలించినా ప్రయాగం చేసిన క్షణంలో అలెర్ట్స్ ని మొబైల్ అప్లికేషన్ కు మరియు వాట్సాప్ కి పంపిస్తుంది అంతే కాకుండా లోకల్ గా Hooter – ఎలక్ట్రానిక్ సైరెన్ ని మొగిస్తుంది. దీనితో సెక్యూరిటీ వారు అలెర్ట్ ఐ చెట్లను రక్షించుకోగలుగుతారు అలాగే దొంగలను కూడా వెంటనే పట్టుకోగలుగుతారు.
ఈ పరికరము ప్రతి రోజు చెట్టు యొక్క హాజరుని నమోదు చేసి ఇమెయిల్ ద్వారా యూజర్స్ కి తెలియచేస్తుంది.
ఈ పరికరము మొబైల్ అప్లికేషన్స్ మరియు క్లౌడ్ సర్వర్ తో అనుసంధానం ఐ ఉంటుంది. తద్వారా వివిధ రాకలైన నివేదికలను పంపిస్తుంది.
సత్యనారాయణ చొప్పదండి CEO. CTIOT టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ ఈ యొక్క సొల్యూషన్ ని తెలంగాణ లో మొదటిసారిగా ప్రయోగత్మకంగా బోటనికల్ గార్డెన్ నందు 50 చెట్లకు అమర్చడం జరిగింది. దీనిని వివిధ ప్రాంతాలలో వున్నా చాలా ఖరీది ఉన్నటువంటి వృక్షాలకు అమర్చడం వల్ల మరియు చందనము ఎర్ర చందనము పండించే రైతులకు చాలా మేలు జరుగుతుందని వారు తెలియచేసారు.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి ఐ. ఎఫ్. స్. మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్నో చోట్ల మొక్కలను రాత్రికి రాత్రి కొట్టేయడం జరుగుతుందని దాని వల్ల ఎన్నో విలువైన వృక్షాలు అంతరించిపోతున్నాయని అన్నాను. ఈ యొక్క రియల్ టైం చీప్ సెన్సర్ ని ఉపయోగించుకుంటూ ప్రయోగత్మకంగా బోటానికల్ గార్డెన్ నందు 50 విలువైన వృక్షాలకు అమర్చడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ మరిన్ని వృక్షాలకు అమర్చుతామని తెలియచేసారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ ఐ.ఎఫ్.స్., డైరెక్టర్ ఎం. జె. అక్బర్, జి. ఎం. రవీందర్ రెడ్డి, ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేనేజర్ సుమన్, రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ పాల్గొన్నారు.