Sunday, January 19, 2025
HomeTrending Newsకాంట్రాక్టు ఉద్యోగులకు సిఎం జగన్ శుభవార్త

కాంట్రాక్టు ఉద్యోగులకు సిఎం జగన్ శుభవార్త

కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుభవార్త అందించారు. ఐదేళ్ళ నిబంధన తొలగించి 2014 జూన్ 2 నాటికి సర్వీసులో ఉన్న  కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు. ఈ నియామక ఫైలుపై సిఎం జగన్ సంతకం చేశారని దీనికి సంబంధించిన ఉత్తర్వులను నాలుగైదు రోజుల్లో విడుదల అవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

జూన్ 5 న ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ  జాయింట్ స్టాప్ కౌన్సిల్ తో సమావేశమైంది.  2014 జూన్ 2 నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. దీనిపై వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేళ్ళ నిబంధన విధించడం సరికాదని, రాష్ట్ర విభజన నాటికి పని చేస్తూ ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని వివిధ స్థాయిల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సబ్ కమిటీ  సిఎం దృష్టికి తీసుకు వెళ్ళింది. దీనిపై సిఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

ఈనెల 21, 22 తేదీల్లో ఏపీ ఎన్జీవో 22వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరగనున్నాయి. సిఎం జగన్ ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వీటికి వారం ముందుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్