విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది. ఈ మ్యూజిక్ కన్సర్ట్ లో ‘ఖుషి’ సినిమాలోని బ్యూటిపుల్ సాంగ్స్ ను సింగర్స్ జావెద్ అలీ, సిధ్ శ్రీరామ్, మంజూష, చిన్మయి, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడి ఆకట్టుకున్నారు. ‘ఖుషి’ టైటిల్ సాంగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లైవ్ పర్ ఫార్మెన్స్ కు ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. మ్యూజిక్ కన్సర్ట్ లో
హీరోయిన్ సమంత మాట్లాడుతూ – షూటింగ్ టైమ్ లో పాటలు విని ‘ఖుషి’ ఆల్బమ్ లవ్ లో పడిపోయాను. ఇక్కడ లైవ్ లో పాటలు వింటుంటే టైమ్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సెప్టెంబర్ 1న మీ అందరితో సినిమా చూడాలని అనిపిస్తోంది. మేమెప్పుడూ మీ అందరికీ నచ్చే సినిమా ఇవ్వాలని కోరుకుంటాం. ఈ సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాం. మైత్రీ ప్రొడ్యూసర్స్ నా ఫేవరేట్ ప్రొడ్యూసర్స్. నా ఫేవరేట్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వాళ్లే. గత ఏడాదిగా నాకు వాళ్లు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ ‘ఖుషి’ . ఇందులో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ శివ గారికి థాంక్స్. హేషమ్ గారికి తెలుగు ఆడియెన్స్ లవ్ తెలియదు. ఇప్పుడు చూస్తున్నారు. వాళ్లు ప్రేమిస్తే ఎంత బాగా అభిమానిస్తారో ఆయనకు ఇప్పుడు తెలుస్తుంటుంది. ‘ఖుషి’ లో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వారి కాంట్రిబ్యూషన్ సినిమాకెంతో బలాన్నిచ్చింది. మీరు చూపించే ప్రేమ కోసం హెల్దీగా తిరిగి వస్తాను. బ్లాక్ బస్టర్ ఇస్తాను. అని చెప్పింది.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ కోసం ఇక్కడికి వచ్చిన వారికి, టీవీ, యూట్యూబ్ లో చూస్తున్న వారందరికీ నా థ్యాంక్స్. సెప్టెంబర్ 1న నా తరుపున మీకు ఖుషి తీసుకొస్తున్నా. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఏ భాషలో మాట్లాడేవారైనా మీ దగ్గరకు ఖుషి పంచేందుకు వచ్చేస్తాం. మీరు సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇచ్చి ఎంతకాలం అవుతుందో గుర్తులేదు. మీ అందరికీ ఓ సూపర్ హిట్ బాకీ ఉన్నా. గత నెల రోజులుగా ఈ సినిమా వర్క్స్ గురించి డైరెక్టర్ శివతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నా. ప్రతిసారీ ఆయన నాకు చెప్పే మాట ఒకటే. సెప్టెంబర్ 1న నీ మొహంలో నవ్వు చూడాలి విజయ్ బ్రో అని. అదొక్కటే గుర్తు పెట్టుకుని పనిచేస్తున్నా అనేవాడు. శివకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఆయన చెప్పనక్కర్లేదు. నాకు తెలుస్తుంది. ఈ సినిమాను శివ ఎంత ప్రేమించి చేశాడో రేపు సెప్టెంబర్ 1న థియేటర్స్ లో సినిమా చూస్తున్న మీ అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా సక్సెస్ సంతోషం నా ఫేస్ లో కాదు సమంతలో చూడాలి. ఆమె ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో చెప్పలేను. ఏప్రిల్ లో ఎంతో హ్యాపీగా సినిమాను స్టార్ట్ చేశాం. మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జూలైలో 30, 35 డేస్ షూట్ మిగిలినప్పుడు సమంత తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పింది. నువ్వు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావ్, నువ్వు హెల్దీగా ఉంటావ్ అని నేను, శివ సమంతకు చెప్పేవాళ్లం. మొదట్లో 3 డేస్, ఆ తర్వాత 2 వీక్స్ టైమ్ తీసుకుంది. అయినా ఆరోగ్యం బాగు కాలేదు. నేను వేరే సినిమా ప్రమోషన్ కోసం వెళ్లినప్పుడు ఆమె హెల్త్ కండీషన్ గురించి తెలిసింది. నేను ఈ విషయం గురించి మాట్లాడొద్దు అనుకున్నా. ఎందుకంటే మనం యాక్టర్స్ గా ప్రేక్షకుల్ని నవ్వించాలి. మన బాధల్ని చెప్పకూడదు అనుకున్నా. కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేక సమంత మాతో మాట్లాడటం మానేసింది. తను అంతగా స్ట్రగుల్ పడింది.
అయితే ఒక సందర్భంలో సమంత తన హెల్త్ కండీషన్ గురించి మాట్లాడేందుకు ముందుకొచ్చింది. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఎంతోమంది ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. నేనూ మీలాగే బ్యాటిల్ చేస్తున్నా అని వారికి ధైర్యం చెప్పేందుకు సమంత తన హెల్త్ కండీషన్ వెల్లడించింది. ఇవాళ మేము ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తుంటే చాలామంది వచ్చి సమంత మాకు ఇన్సిపిరేషన్ అని చెబుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెకు బాగాలేదు. అయినా మన కోసం ఆమె ఇక్కడికి వచ్చింది. డ్యాన్స్ చేసింది. సెప్టెంబర్ 1న సమంతకు హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే మా డైరెక్టర్ శివకు హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. డియర్ కామ్రేడ్ టైమ్ లో శివ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పాడు. విపరీతంగా నచ్చింది. అయితే లవ్ స్టోరీస్ చేయొద్దని హోల్డ్ చేస్తూ వచ్చాను. షూటింగ్ లో ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా శివ దేని గురించి కంప్లైంట్ చేయలేదు. సినిమాను ప్రేమిస్తూ, నవ్వుతూ వర్క్ చేస్తూ వచ్చాడు. అతని కోసం సినిమా హిట్ కావాలి. మా సినిమాటోగ్రాఫర్ ఎంతో కమిటెడ్ గా వర్క్ చేశారు. అలాగే హేషమ్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. మా మైత్రీ వాళ్లకు పుష్ప 2 ఉంది. వాళ్లకు డబ్బులే డబ్బులు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఆరేడు ఏళ్లు అవుతోంది. నన్ను మీరంతా ఎంతగానో ప్రేమిస్తున్నారు. నా హిట్స్, ఫ్లాప్స్ లో నా చుట్టూ ఉన్న వాళ్లు ఎందరు మారినా మీరు మారలేదు. నాపై లవ్ చూపిస్తూ నాతోనే ఉన్నారు. సెప్టెంబర్ 1న మీ అందరి మొహాల్లో నవ్వు చూడాలని అనుకుంటున్నా. అని అన్నారు.