Tuesday, March 10, 2026
Homeసినిమా‘స్కంద’ సెకండ్ సింగల్ 'గందారబాయ్' ఈ నెల 18న విడుదల

‘స్కంద’ సెకండ్ సింగల్ ‘గందారబాయ్’ ఈ నెల 18న విడుదల

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద’ రూపొందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టైటిల్‌ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, థమన్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉంది.

ఇప్పుడు స్కంద సెకండ్ సింగల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆగస్ట్ 18న స్కంద సెకండ్ సింగిల్ ‘గందారబాయ్’ ని విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ శ్రీలీల పార్టీ వేర్ లో కలర్ ఫుల్ గా కనిపించారు.ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,  పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular