Tuesday, June 16, 2026
Homeసినిమా'స్కంద'నుంచి 'గందారబాయి' సాంగ్ విడుదల

‘స్కంద’నుంచి ‘గందారబాయి’ సాంగ్ విడుదల

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’- ది ఎటాకర్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది. మొదటి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మేకర్స్ సెకండ్  సింగిల్ ‘గందారబాయి’ లిరికల్ వీడియోని విడుదల చేశారు.

ఎస్ఎస్  థమన్ మరో బ్లాక్ బస్టర్ నంబర్‌ను అందించారు. మొదటి పాట ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అయితే, గందారబాయి మాస్ ధమకేధార్ ఫోక్లోర్. బీట్, ఆర్కెస్ట్రేషన్ ఎనర్జిటిక్ గా మాస్ వైబ్‌తో ఆకట్టుకున్నాయి.  నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల వాయిస్ మెస్మరైజ్ చేసింది. అనంత శ్రీరామ్ మాస్ లిరిక్స్ రాసిన ఈ పాటను వైబ్రెంట్ సెట్స్ లో చిత్రీకరించారు.

రామ్, శ్రీలీల  తమ ఎనర్జీతో ప్రేక్షకుల మనసుని కొల్లకొట్టారు.ఎక్స్ టార్డినరీ  డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. రామ్ డ్యాన్స్‌లో డైనమిజం చూపించగా, శ్రీలీల ఎనర్జీతో మ్యాచ్ చేసింది. ఈ ఇద్దరు గ్రేట్ డ్యాన్సర్లు. వాళ్ళ డ్యాన్స్  చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ నంబర్ కు కొరియోగ్రఫీ చేశారు.ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular