Tuesday, June 16, 2026
Homeసినిమాసింగిల్ షెడ్యూల్‌ లో 'కలియుగం పట్టణంలో' చిత్రీకరణ

సింగిల్ షెడ్యూల్‌ లో ‘కలియుగం పట్టణంలో’ చిత్రీకరణ

విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘కలియుగం పట్టణంలో’ నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

కలియుగం పట్టణంలో టైటిల్ పోస్టర్‌తోనే సినిమా మీద జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు శర వేగంగా సినిమాను పూర్తి చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను నిర్మాతలు ఇచ్చారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్‌లో పూర్తి చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం నిర్మాత ఎక్కడా కూడా కాంప్రైమజ్ కాకుండా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో మొత్తం తారాగణం అంతా పాల్గొంటోంది.ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular