Friday, October 18, 2024
Homeసినిమాప్రభాస్ సలార్ అప్ డేట్ ఏంటి..?

ప్రభాస్ సలార్ అప్ డేట్ ఏంటి..?

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ‘సలార్’ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ప్రభాస్ కు రాకపోవడంతో.. సలార్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందని వెయిట్ చేస్తే.. అసలు సింగిల్సే రిలీజ్ చేయకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. డైరెక్ట్ గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. మరి.. సలార్ ట్రైలర్ ఎప్పుడంటారా..? ఈ నెలాఖరులో సలార్ ట్రైలర్ రిలీజ్ అని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. సలార్ రన్ టైమ్ గురించి ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఎడిటింగ్ అంతా అయిన తర్వాత చూస్తే.. సలార్ రన్ టైమ్ మూడు గంటల పైనే వచ్చిందట. మూడు గంటలు రన్ టైమ్ అంటే చాలా ఎక్కువు అవుతుందని.. ఆడియన్స్ బోర్ ఫీలయ్యే అవకాశం ఉందని.. ఇప్పుడు ఈ రన్ టైమ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు మరోసారి ఎడిటింగ్ చేస్తున్నారట. రెండు గంటల నలభై ఐదు నిమిషాల రన్ టైమ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ఎడిటింగ్ రూమ్ లో చాలా కేర్ తీసుకుంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదీ లీక్ కాకుండా చూసుకుంటున్నారట. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సలార్ పై అభిమానుల్లోనూ కాకుండా కామన్ ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్