Wednesday, June 17, 2026
Homeసినిమానా సినిమా గురించి నేను చెప్పదలకున్నది ఇదే: హీరో వరుణ్ తేజ్ 

నా సినిమా గురించి నేను చెప్పదలకున్నది ఇదే: హీరో వరుణ్ తేజ్ 

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందిన ‘గాండీవధారి అర్జున’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను  థియేటర్లకు తీసుకొస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. సాక్షి వైద్య ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ స్టేజ్ పై వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ‘ముందుగా మెగాడాడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఆడిటోరియంలో హుషారు తెచ్చాడు.

కొత్త కథలను ఎంచుకోవాలనీ .. ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో తాను సినిమాలు చేస్తూ వెళుతున్నానని అన్నాడు. ‘కొత్తగా ప్రయోగాలు చేయడం అవసరమా?’ అని తనతో చాలామంది అంటూ ఉంటారనీ, అయితే తనకి నచ్చిన కథలను .. నమ్మిన కథలను వదలకుండా చేస్తూ వెళుతున్నానని చెప్పాడు. తన నిర్ణయాలను ఆడియన్స్ సపోర్టు చేయడం సంతోషంగా ఉందని అన్నాడు. తాను ఈ సినిమా చేయడానికి యాక్షన్ కారణమని అంతా అనుకుంటారనీ .. కానీ ఎమోషన్ ప్రధానమైన కారణమని అన్నాడు. ఎమోషన్స్ నచ్చడం వల్లనే తాను ఇంట్రెస్ట్ చూపించానని చెప్పాడు.

లవ్ .. యాక్షన్ … కామెడీ వంటి జోనర్లలో సాగే సినిమాలు రావడం .. చేయడం సహజంగానే జరిగిపోతుంటాయనీ, కానీ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలో చేసే ఛాన్స్ చాలా కొంతమందికి మాత్రమే వస్తూ ఉంటుందని అన్నాడు. అలాంటి ఒక అవకాశం తనకి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. తన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే విషయం తాను చెప్పకూడదనీ, ఆ విషయాన్ని ఆడియన్స్ చెప్పాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒక మంచి ప్రయత్నం చేశాననే సంతృప్తి తనకి ఉందంటూ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular