తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నేడు 24 మంది సభ్యులను నియమించారు. దీనిలో ముగ్గురు ఎమ్మెల్యేలు సామినేనిసామినేని ఉదయభాను(జగయ్యపేట), పొన్నాడ సతీష్(ముమ్మిడివరం), తిప్పేస్వామి(మడకశిర)కి అవకాశం దక్కింది.
ఇక.. టీటీడీ సభ్యులుగా గోదావరి జిల్లాల నుంచి సుబ్బరాజు (ఉంగుటూరు).. నాగ సత్యం యాదవ్(ఏలూరు), ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా సుధీర్(శిద్ధా రాఘవరావు కుమారుడు), కడప నుంచి యానాదయ్య.. మాసీమ బాబు, వై. సీతారామిరెడ్డి(మంత్రాలయం), శరత్, అశ్వద్థనాయక్‌లకు అనంతపురం నుంచి చోటు దక్కింది.
అలాగే.. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి దేశ్‌పాండే, తెలంగాణ నుంచి సీతా రంజిత్‌రెడ్డి( ఎంపీ రంజిత్‌రెడ్డి సతీమణి) , మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్‌బోరా, మిలింద్ సర్వకర్‌లకు అవకాశం కల్పించారు. టీ