Friday, March 13, 2026
HomeTrending NewsTTD Board: ఆలయ పవిత్రతపై సిఎంకు నమ్మకం లేదు: పురంధేశ్వరి

TTD Board: ఆలయ పవిత్రతపై సిఎంకు నమ్మకం లేదు: పురంధేశ్వరి

టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని సిఎం జగన్ మరోసారి నిరూపించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి  వ్యాఖ్యానించారు.  నిన్న రాత్రి ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై  ట్వీట్ ద్వారా  తన స్పందనను ఆమె వెల్లడించారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో పాత్రధారుడిగా ఉన్న శరత్ చంద్రా రెడ్డి,  ఎంసీఐ స్కాం లో దోషిగా నిరూపించబడి ఢిల్లీ హై కోర్టు చేత తొలగించబడ్డ కేతన్ దేశాయ్ లాంటివారిని బోర్డులో నియమించడం దారుణమని అన్నారు.  ఇలాంటి వారిని నియమించడం ద్వారా తిరుమల తిరుపతి పవిత్రత ను  కాపాడడంలో సిఎం కు ఏమాత్రం నమ్మకం లేదన్న విషయాన్ని తెలియజేస్తోందని అన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టను  మసకబరిచేలా ఉన్న నియామకాలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని ఆమె పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular