Wednesday, March 11, 2026
HomeTrending NewsChicago: త్వరలో తెలంగాణ ఫుడ్ షాప్ - మంత్రి కేటీఆర్

Chicago: త్వరలో తెలంగాణ ఫుడ్ షాప్ – మంత్రి కేటీఆర్

పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు చికాగో నగరంలో చికాగో ఫుడ్ ప్రాసెసింగ్ ఈకో సిస్టం ను అధ్యయనం చేశారు. మంత్రి కేటీఆర్ చికాగో నగరంలోని చికాగో ఫుడ్ షాప్ ను సందర్శించి అక్కడ వరల్డ్ బిజినెస్ షికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. చికాగో నగరానికి చెందిన పబ్లిక్ మరియు ప్రైవేట్ ఆర్థిక అభివృద్ధి ఏజెన్సీగా వరల్డ్ బిజినెస్ చికాగో పనిచేస్తుంది. చికాగో ఫుడ్ షాప్ లో ఏర్పాటు చేసిన అనేక షాపులను ఆహార పద్ధతులు, వాటి చరిత్ర, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన వంటి అంశాలను పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తూనే తమ ఆహార ఉత్పత్తులు ఆహారపు అలవాట్ల పైన ప్రత్యేకతలను జోడిస్తూ వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు పంచుకుంటూ వారి నుంచి ఫీడ్బ్యాక్ అందుకునే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను చికాగో ఫుడ్ షాప్ కలిగి ఉంది.

చికాగో నగరం ఫుడ్ ఇన్నోవేషన్ సాంప్రదాయకంగా వచ్చిన ఆహారపు అలవాట్లు, ఆహారపు ఉత్పత్తుల సరఫరా వంటి అంశాలను కాపాడుకోవడంలో అగ్రస్థానంలో ఉన్నదని చికాగో ఫుడ్ షాప్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు తెలిపారు.

మంత్రి కేటీఆర్ చికాగో ఫుడ్ షాప్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. ముఖ్యంగా చికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రోక్యుర్మెంట్ పద్ధతుల పైన ప్రత్యేకంగా చర్చించారు. ప్రజలకు అత్యంత కీలకమైన ఆహార సంబంధిత రంగంలో చికాగో ఫుడ్ షాప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టం వంటి వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చికాగో ఫుడ్ షాప్ మాదిరి… ఫుడ్ ప్రాసెసింగ్ పురోగతికి, తెలంగాణ ఆహార ఉత్పత్తులలో ఇన్నోవేషన్, ఆహార అలవాట్ల చరిత్రను భద్రపరచడం వంటి అంశాల కోసం తెలంగాణ ఫుడ్ షాప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు కేటీఆర్.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉన్నదని, ఇది కేవలం ఫుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రంగం పైన ఆధారపడిన రైతులు మరియు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి సైతం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే మద్దతు ఇచ్చి ఊరుకోకుండా దాని అనుబంధ రంగమైన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, కోకా కోల , పెప్సీకో, ఐటిసి వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం పదివేల ఎకరాలకు పైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular