Thursday, June 18, 2026
Homeసినిమాసక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బెదురులంక

సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బెదురులంక

ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయమై తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన యంగ్ హీరో కార్తికేయ. ఆతర్వాత గుణ 369, గ్యాంగ్ లీడర్, వాలిమై, విక్రమార్క తదితర చిత్రాల్లో నటించాడు కానీ.. కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. అయితే.. ఇప్పుడు బెదురులంక 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి క్లాక్స్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు ఆగష్టు 25న విడుదల అయ్యింది.

అయితే.. అదే రోజున మెగా హీరో వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున విడుదల కావడంతో బెదురులంక సినిమా అంతగా ఆకట్టుకోకపోవచ్చు అనే టాక్ వచ్చింది కానీ.. ఊహించని విధంగా వరుణ్ తేజ్ మూవీ కంటే కార్తికేయ సినిమాకే పాజిటివ్ టాక్ వచ్చింది. శని, ఆదివారాల్లో బెదురులంక చిత్రానికి కలెక్షన్స్ బాగా రావడంతో మేకర్స్ హ్యాఫీగా ఉన్నారు. ఈ సినిమా రెండు రోజులకు 3.83 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇందులో కార్తికేయకు జంటగా నేహాశెట్టి నటించింది. అజయ్ ఘోస్, ఆటో రామ్ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, ఎల్బీ శ్రీరామ్ కీలక పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular