Tuesday, June 16, 2026
HomeసినిమాSree Leela: రవితేజతో మరో సినిమా చేయనున్న శ్రీలీల..?

Sree Leela: రవితేజతో మరో సినిమా చేయనున్న శ్రీలీల..?

రవితేజను మళ్లీ ఫామ్ లోకి తీసుకువచ్చిన చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రానికి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో క్రేజీ హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టిందనే పేరు వచ్చింది. ఇప్పుడు రవితేజ, శ్రీలీల కలిసి మరో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే…. రవితేజతో మలినేని గోపీచంద్ డాన్ శ్రీను, బలుపు, క్రాక్ చిత్రాలు తెరకెక్కించారు. ఈ మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి.

క్రాక్ మూవీ అయితే.. బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబోలో మరో సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలయ్యతో వీరసింహారెడ్డి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత మలినేని గోపీచంద్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. రవితేజతోనే నెక్ట్స్ మూవీ చేయనున్నారని తెలిసింది. ఇందులో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular