Saturday, January 18, 2025
HomeTrending NewsMalkajgiri: ఆ వార్తలో నిజం లేదు: శంభీపూర్ రాజు

Malkajgiri: ఆ వార్తలో నిజం లేదు: శంభీపూర్ రాజు

మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్టు వచ్చిన వార్తలను మేడ్చల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఖండించారు.  ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మైనం పల్లి హనుమంతరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని, నేడో రేపో ఈ ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి, మైనంపల్లి స్థానంలో శంభీపూర్ బరిలోకి దిగితున్నారని ప్రచారం జరిగింది.  దీనికి తోడు మంత్రి హరీష్ రావు తో శంభీపూర్ రాజు దిగిన ఫోటో ఒకటి వైరల్ అయ్యింది, అభ్యర్ధిత్వం ఖరారు చేయడం కోసమే ఈ భేటీ జరిగిందని సమాచారం వచ్చింది.

దీనిపై రాజు స్పందించారు. “కొన్ని మీడియా, సోషల్ మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు… ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పనుల మీదనే మంత్రి హరీష్ రావు గారిని కలిశాను … మంత్రితో భేటీ సందర్భంగా వేరే విషయాలు ఏవీ చర్చకు రాలేదు. మీడియా తక్షణమే దుష్రచారాన్ని ఆపాలి” అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్