ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తుది తీర్పునకు లోబడి బదిలీలు ఉండాలని హై కోర్ట్ ఆదేశించింది. టీచర్ బదిలీలపై మద్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వటాన్ని తప్పు పట్టింది.
యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి హైకోర్టు సమ్మతించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశం అన్న హైకోర్టు తుది తీర్పునకు లోబడే బదిలీలు ఉంటాయని స్పష్టం చేసింది.