Friday, September 20, 2024
HomeసినిమాMAD: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తదుపరి చిత్రం 'మ్యాడ్'ని ప్రకటించింది

MAD: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తదుపరి చిత్రం ‘మ్యాడ్’ని ప్రకటించింది

తాజాగా సూర్యదేవర నాగ వంశీ, రక్షా బంధన్ సందర్భంగా తమ సంస్థ నుండి ఒక ప్రత్యేక చిత్రాన్ని ప్రకటించారు. చినబాబు కుమార్తె, నాగ వంశీ సోదరి హారిక సూర్యదేవర ఈ కొత్త చిత్రం ‘ప్రొడక్షన్ నెం.18’తో నిర్మాతగా పరిచయమవుతుండటం విశేషం. నాగ వంశీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయి సౌజన్య, హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు.

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘మ్యాడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్