Friday, September 20, 2024
Homeసినిమానాగ‌శౌర్య ‘ల‌క్ష్య‌’ ఫ్రైడే స్పెష‌ల్‌.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ విడుద‌ల‌

నాగ‌శౌర్య ‘ల‌క్ష్య‌’ ఫ్రైడే స్పెష‌ల్‌.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ విడుద‌ల‌

నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న ‘ల‌క్ష్య’. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్నిసోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌ పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌మోషన్ ను ఇటీవ‌ల కిక్‌ స్టార్ట్ చేసి #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్ర‌తీ శుక్ర‌వారం ఒక కొత్త అప్డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలియ‌జేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ప్ర‌తీ శుక్ర‌వారం విడుద‌ల చేస్తున్న అప్‌డేట్స్ సినిమా పై ఆస‌క్తి పెంచ‌డ‌మే కాదు.. అంచ‌నాల‌ను కూడా పెంచేస్తున్నాయి.

ఈ శుక్ర‌వారం మరో వర్కింగ్ స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో హీరో నాగ‌శౌర్య‌, ద‌ర్శ‌కుడు ధీరేంద్ర సంతోష్ సీన్ డిస్క‌స్ చేసుకోవ‌డం, సీన్‌లో ఎలా వ‌చ్చింద‌ని హీరో, హీరోయిన్ చెక్ చేసుకోవ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. నాగ శౌర్యకు ఇది 20వ సినిమా… సరికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ఆ లుక్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికే విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్