బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. గంటకు 30 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని…వాతావరణ శాఖ రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. నిన్న సాయంత్రం ఒక్కపోతగా ఉన్న వాతావరణం ఉదయం నుంచి మబ్బులు కమ్ముకుంది. హైదరాబాద్ పశ్చిమ దిశలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ , షేక్ పేట , మణికొండ, రాయదుర్గంలో వర్షం ఎక్కువగా పడింది.