Friday, September 20, 2024
HomeTrending NewsJamili: ప్రజాస్వామ్యానికే ప్రమాదం జమిలి - రేవంత్ రెడ్డి

Jamili: ప్రజాస్వామ్యానికే ప్రమాదం జమిలి – రేవంత్ రెడ్డి

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే భాజపా జమిలి ఎన్నికల ప్రస్థావన తెస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘‘అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ తీసుకురావాలని చూస్తున్నారు. ఈ జమిలి ఎన్నికలు మున్ముందు అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారే అవకాశం ఉంది. అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది’’ అని రేవంత్‌ ఆరోపించారు.

ప్రస్తుతం బీజేపీ మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కర్ణాటకలో గల్లీగల్లీ తిరిగినా.. ప్రధాని మోదీ, అమిత్‌షా 30 రోజులు ప్రచారం చేసినా బీజేపీ గెలవలేదన్నారు.‘‘రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు నివేదికలు ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమికి అవమానకర పరిస్థితి ఎదురవుతుందనే మోదీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెరమీదకు తీసుకువచ్చిందని” రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ తెచ్చిన ప్రతీ బిల్లుకు బీఆరెస్ మద్దతు ఇచ్చిందన్నారు.
బీజేపీ, బీఆరెస్ వేరు వేరు కాదు.. అవి ఒకే తాను ముక్కలు అని విమర్శించారు. జమిలి ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ 2018లో సీఎం కేసీఆర్‌ లేఖ రాసిన రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎలక్షన్ కోడ్ తో రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకమని కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు. ఆ లేఖ ను బి.వినోద్ కుమార్ ఇచ్చి చౌహన్ కి పంపించారన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్న కేసీఆర్… ఈ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో ప్రజలకు విస్పష్టంగా చెప్పాలి అని డిమాండ్ చేశారు.
బోయలకు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్: రేవంత్ రెడ్డి

బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని కేసీఆర్ మాట తప్పారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం గాంధీభవన్లో రేవంత్ రెడ్డిని కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాల్మీకి బోయలు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారినుద్దేశించి ప్రసంగించారు. ఆనాడు నడిగడ్డలో పాదయాత్ర చేస్తే… బోయలు కేసీఆర్ కు అండగా నిలబడ్డారన్నారు. 2009లో మహబూబ్ నగర్ కు వలస వచ్చిన కేసీఆర్ ను పాలమూరు బిడ్డలు గెలిపించారు. కానీ 2014లో కేసీఆర్ బోయ భీముడిని ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. పదేళ్లు అయినా కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.గద్వాల, అలంపూర్ నిర్వాసితులను ఆదుకోలేదని కేసీఆర్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వాల్మీకి బోయల శక్తి గద్వాల సంస్థనాన్ని నిలబెట్టిందన్నారు. ఆనాడు బంగాళాలు బద్దలు కొట్టి….గట్టు భీమున్నీ ఎమ్మెల్యే చేసి మీ పౌరుషాన్ని చూపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వాల్మీకి బోయల అండ లేకుండా ఎవరూ గెలవలేరన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్